చరిత్ర సృష్టించిన మహిళా షట్లర్లు

Feb 16,2024 22:15 #Sports

హాంకాంగ్‌పై 3-0 గెలుపుతో పతకం ఖాయం

ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్‌ షిప్‌

కౌలాలంపూర్‌: ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో భారత్‌ 3ా0తో హాంకాంగ్‌ మహిళలను చిత్తుచేసి సెమీస్‌కు చేరి పతకం ఖాయం చేసుకుంది. దీంతో భారత మహిళలజట్టుకు కనీసం కాంస్య పతకం దక్కనుంది. ఈ టోర్నమెంట్‌ చరిత్రలో మహిళల బృందానికి పతకం దక్కడం ఇదే తొలిసారి. తొలి లీగ్‌లో పటిష్ఠ చైనాపై 3-2తో ఓడించడంతో భారత్‌కు ఊరటనిచ్చే అంశం. నేడు జరిగిన తొలి సింగిల్స్‌లో పివి సింధు 21-7, 16-21, 21-12తో సిన్‌-యన్‌-హప్పీపై విజయం సాధించి భారత్‌ను 1-0 ఆధిక్యతలో నిలిపింది. మహిళల డబుల్స్‌లో తానీషాాఅశ్విని జంట 18వ ర్యాంకర్‌ జంటపై 21-10, 21-14తో కేవలం 35నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి భారత్‌కు 2ా0 ఆధిక్యతో నిలిపింది. ఇక మూడో సింగిల్స్‌ మ్యాచ్‌లో అస్మిత 21-12, 21-13తో యంగ్‌ాసుమ్‌ాయీపై విజయం సాధించడంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలిన ఉండగానే విజయం ఖాయమైంది. సెమీస్‌లో భారత మహిళల జట్టు జపాన్‌తో తలపడనుంది. ఇక పురుషుల బృందం సెమీస్‌కు చేరడంలో విఫలమైంది. శుక్రవారం జరిగిన నాకౌట్‌ పోరులో భారత పురుషుల జట్టు 2-3తో జపాన్‌ చేతిలో ఓడింది. తొలి సింగిల్స్‌లో ప్రణయ్ 16-21, 24-26తో నిషిమోటో చేతిలో ఓటమిపాలవ్వడగా.. డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ 21-15, 21-17తో నెగ్గి స్కోర్‌ను 1-1తో సమం చేశారు. లక్ష్యసేన్‌ 21-19, 22-20తో నెగ్గినా.. మరో డబుల్స్‌లో అర్జున్‌ాధృవ్‌ కపిల 17-21, 15-21తో ఓడారు. నిర్ణయాత్మక చివరి సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ పోరాడి ఓడాడు. కిదాంబి 21-17, 9-21, 20-22తో టాప్‌సీడ్‌ కెంటో మొమొటో చేతిలో పరాజయాన్ని చవిచూడడంతో 2-3తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.

➡️