ఢిల్లీ క్యాపిటల్స్‌ 113 అలౌట్‌

Mar 17,2024 21:20 #Cricket, #rcb womens, #Sports, #wipl

ఆర్సీబీ బౌలర్ల దాటికి ఢిల్లీ క్యాపిటల్స్‌ 113 పరుగులకు అలౌట్‌ అయ్యింది. శాశంక పాటిక్‌ 4, సోఫీ మోలినెక్స్‌ 3, ఫేర్రి 2 వికెట్లు తీయండంతో ఢిల్లీ ఎక్కువ పరుగులు చేయలేకపోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు శూభారంభం దక్కింది. ఏడు ఓవర్లల్లో ఓపెనర్లు షఫాలీ వర్మ 27 బంతుల్లో 44 పరుగులు చేయగా మెగ్‌ లెనింగ్‌ 23 బంతుల్లో 23 పరుగులు చేశారు. ఎనిమిదో ఓవర్‌లో సోఫీ మోలినెక్స్‌ 3 మూడు వికెట్లు తీపింది. తొలి బంతికి షఫాలీ వర్మను (44) ఔట్‌ చేసిన సోఫీ.. మూడో బంతికి రోడ్రిగెజ్‌ను (0), నాలుగో బంతికి అలైస్‌ క్యాప్సీ (0) పెవిలియన్‌కు పంపింది. అనంతరం వరుస విరామాల్లో ఆర్‌సిబి వికెట్లు తీసింది. మారిజానే కాప్‌ 8, జెస్‌ జోనాస్సెన్‌ 3, రాధా యాదవ్‌ 12, అరుంధతి రెడ్డి 10, తానియా భాటియా (0), శిఖా పాండే(1), మిన్ను మణి(5) పరుగులు చేసి నిరాశపరిచారు.

➡️