ధనుంజయ, కమిందు సెంచరీలు

Mar 22,2024 22:30 #Sports

శ్రీలంక 280ఆలౌట్‌
బంగ్లాదేశ్‌తో తొలిటెస్ట్‌
సైహెట్‌(బంగ్లాదేశ్‌): బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక కెప్టెన్‌ ధనుంజయ, కమిందు మెండీస్‌ సెంచరీలతో రాణించారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు తొలిరోజు 280పరుగులకే ఆలౌటైంది. వీరిద్దరు మినహా మిగిలిన బ్యాటర్లందరూ నిరాశపరిచారు. తొలుత బంగ్లా బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక జట్టు 57పరుగులకే 5వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో వీరిద్దరూ సెంచరీలతో కదం తొక్కి 6వ వికెట్‌కు ఏకంగా 202పరుగులు జతచేశారు. శ్రీలంక జట్టు 259పరుగుల వద్ద 6వ వికెట్‌గా కమిందు నిష్క్రమించగా.. ఆత ఆరవ్త కేవలం 21 పరుగులకే మిగిలిన వికెట్లన్నీ లంక జట్టు కోల్పోయింది. బంగ్లాదేశ్‌ బౌలర్లు ఖలీద్‌, నహిద్‌కు మూడేసి, షోరిఫుల్‌, తంజుల్‌ ఇస్లామ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ జట్టు 32పరుగుల 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్‌లో మహ్మదుల్లా(9), తంజుల్‌(0) ఉన్నారు. టి20 సిరీస్‌ను శ్రీలంక, వన్డే సిరీస్‌ సిరీస్‌ను బంగ్లాదేశ్‌ జట్లు చేజిక్కించుకొన్న సంగతి తెలిసిందే.

➡️