నాల్గో టి20లోనూ కివీస్‌ గెలుపు-పాకిస్తాన్‌తో సిరీస్‌

Jan 19,2024 22:30 #Sports

క్రైస్ట్‌చర్చ్‌: పాకిస్తాన్‌తో జరుగుతున్న ఐదు టి20ల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన మూడు టి20ల్లో నెగ్గి సిరీస్‌ను 3ా0తో చేజిక్కించుకున్న న్యూజిలాండ్‌ జట్టు శుక్రవారం జరిగిన నాల్గో టి20లోనూ ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ జట్టు కివీస్‌ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో పాక్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 158పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లు హెన్రీ, ఫెర్గ్యుసన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ జట్టు సునాయాసంగానే ఛేదించింది. తొలి మూడు వికెట్లను 20పరుగులకే కోల్పోయి న్యూజిలాండ్‌.. ఆ తర్వాత మిఛెల్‌(72), ఫిలిప్స్‌(70) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. దీంతో న్యూజిలాండ్‌ 18.1ఓవర్లలోనే విజయం సాధించింది. కెప్టెన్‌ షాహిన్‌ అఫ్రిదికి మూడు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మిఛెల్‌కు లభించగా.. ఐదో, చివరి టి20 ఆదివారం జరగనుంది.

➡️