ఫైనల్లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌

Feb 9,2024 22:05 #Sports

చితక్కొట్టిన క్లాసెన్‌, మల్డర్‌..దక్షిణాఫ్రికా టి20 లీగ్‌

జహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ ఫైనల్లోకి డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వాలిఫయర్‌ా2లో జబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌పై డర్బన్‌ జట్టు 69 పరుగుల తేడాతో గెలుపొందింది. హెన్రిచ్‌ క్లాసెన్‌(74) సిక్సర్లతో విరుచుకుపడగా.. వియాన్‌ మల్డర్‌(50) అర్ధ సెంచరీతో రాణించాడు. క్వాలిఫయర్‌ా1లో మర్క్‌రమ్‌ సేన చేతిలో కంగుతిన్న డర్బన్‌ జట్టు కీలమైన క్వాలిఫయర్‌2లో చెలరేగిపోయింది. జోబర్గ్‌ బౌలర్లను ఉతికారేసిన క్లాసెన్‌ 30 బంతుల్లో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 74 పరుగులు బాదాడు. మరో ఎండ్‌లో మల్డర్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ కొట్టడంతో డర్బన్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 రన్స్‌ కొట్టింది. డర్బన్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ.. వీళ్లిద్దరూ 19 బంతుల్లోనే 61 పరుగులు పిండుకున్నారు. అనంతరం జబర్గ్‌.. 142 పరుగులకే ఆలౌటయ్యింది. జూనియర్‌ డాలా 4 వికెట్లతో డర్బన్‌కు కోలుకోలేని దెబ్బ తీశాడు. భారీ ఛేదనలో కెప్టెన్‌ ఫాఫ్‌ డూప్లెసిస్‌(3), డూ ప్లూరు(10)లు 13 పరుగుల లోపే పెవిలియన్‌ చేరగా.. రీజా హెండ్రిక్స్‌(27), సిబనెలో మఖాన్య(11) వేగంగా ఆడేందుకు ప్రయత్నించి వెనుదిరగారు. మోయిన్‌ అలీ 30, డౌగ్‌ బ్రాస్‌వెల్‌ 23 పరుగులతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌తో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. ఆ తర్వాత యువ పేసర్‌ జూనియర డాలా సంచలన ఇన్నింగ్స్‌తో డర్బన్‌ను ఫైనల్‌కు చేర్చిన క్లాసెన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఫిబ్రవరి 10వ తేదీన జరిగే టైటిల్‌ పోరులో సన్‌రైజర్స్‌, డర్బన్‌ జట్లు అమీతుమీ తేల్చుకున్నాయి.

➡️