బ్యాటింగ్‌లో రాణించినా..బౌలింగ్‌లో నిరాశపరిచారు

Dec 28,2023 22:15 #Sports

…తొలి వన్డేలో ఆస్ట్రేలియా మహిళల చేతిలో ఆరువికెట్ల తేడాతో ఓటమి

మీమా, వస్త్రాకర్‌ అర్ధసెంచరీ

ముంబయి: వాంఖడే జరిగిన ఏకైక టెస్టులో ఆసీస్‌ను చిత్తుచేసిన హర్మన్‌ప్రీత్‌ సేన తొలి వన్డేలో దంచి కొట్టింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు బాదింది. టాపార్డర్‌ విఫలమైనప్పటికీ.. మిడిలార్డర్‌ బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్‌(82), ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌(62 నాటౌట్‌) అర్ధ శతకాలతో చెలరేగారు. ఓపెనర్‌ యస్తికా భాటియా(49) కూడా రాణించడంతో ఆసీస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కంగారూ బౌలర్లలో అషే గార్డ్‌నర్‌, వరేహమ్‌ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌ తొలి ఓవర్లోనే ఒక వికెట్‌ కోల్పోయింది. రేణుకా సింగ్‌ ఓవర్లో ఓపెనర్‌ హేలీ(0) ఔటయ్యింది. ప్రస్తుతం ఎలిసా పెర్రీ(11), ఫొబే లిచ్‌ఫీల్డ్‌(3) ఆడుతున్నారు. టీమిండియా ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. షెఫాలీ వర్మ(1), రీచా ఘోష్‌(21) స్వల్ప వ్యధిలోనే వెనుదిరిగారు. టెస్టు సిరీస్‌లో విఫలమైన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(9), స్నేహ్ రాణా(1) విఫలయ్యారు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన జెమీమా, యస్తికా భాటియా(49), పూజా వస్త్రాకర్‌(62 నాటౌట్‌)తో కలిసి జట్టుకు భారీ స్కోర్‌ అందించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు 1-0 ఆధిక్యతలో నిలువగా.. రెండో వన్డే శనివారం జరగనుంది. స్కోర్‌బోర్డు.. ఇండియా మహిళల ఇన్నింగ్స్‌: యాస్టికా భాటియా (సి)మోగ్నా స్కట్‌ (బి)వరేహామ్‌ 49, షెఫాలీ వర్మ (బి)బ్రౌన్‌ 1, రీచా ఘోష్‌ (సి)మెక్‌గ్రాత్‌ (బి)సథర్లాండ్‌ 21, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (సి)బ్రౌన్‌ (బి)గార్డినర్‌ 9, రోడ్రిగ్స్‌ (సి)మెక్‌గ్రాత్‌ (బి)గార్డినర్‌ 82, దీప్తి శర్మ (సి)లిట్చ్‌ఫీల్డ్‌ (బి)కింగ్‌ 21, అమన్‌జ్యోత్‌ కౌర్‌ (సి)కింగ్‌ (బి)వరేహామ్‌ 1, పూజ వస్త్రాకర్‌ (నాటౌట్‌) 62, రేణుకా సింగ్‌ (నాటౌట్‌) 5, అదనం 11. (50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 282పరుగులు.

వికెట్ల పతనం: 1/12, 2/41, 3/57, 4/95, 5/134, 6/179, 7/182, 8/250

బౌలింగ్‌: బ్రౌన్‌ 7-0-33-1, మోఘన్‌ స్కట్‌ 9-0-47-1, సథర్లాండ్‌ 7-0-43-1, గార్డినర్‌ 10-1-63-2, వారేహమ్‌ 9-0-55-2, తహిలా మెక్‌గ్రాత్‌ 2-0-8-0, అలానా కింగ్‌ 6-0-32-1.

ఆస్ట్రేలియా మహిళల ఇన్నింగ్స్‌: హీలీ (సి)స్నేహ్ రాణా (బి)రేణుకా సింగ్‌ 0, లిట్ఛ్‌ఫీల్డ్‌ (బి)స్నేహ్ రాణా 78, ఎలీసా ఫెర్రీ (సి)పూజ వస్త్రాకర్‌ (బి)దీప్తి శర్మ 75, బెత్‌ మూనీ (బి)పూజ వస్త్రాకర్‌ 42, మెక్‌గ్రాత్‌ (నాటౌట్‌) 68, గార్డినర్‌ (నాటౌట్‌) 7, అదనం 15. (46.3ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 285పరుగులు.

వికెట్ల పతనం: 1/0, 2/148, 3/170, 4/268

బౌలింగ్‌: రేణుక సింగ్‌ 7-1-30-1, పూజ వస్త్రాకర్‌ 8-0-41-1, శికా ఇష్క్‌ 3-0-17-0, అమన్‌జ్యోత్‌ కౌర్‌ 3-0-17-0, స్నేహ్ రాణా 9.3-0-54-1, దీప్తి శర్మ 10-0-55-1, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 3-0-32-0

➡️