రేపు యుపితో ఆంధ్ర ఢీ- రంజీట్రోఫీ-2024

Feb 8,2024 22:15 #Sports

విశాఖపట్నం: రంజీట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు పటిష్ట ఉత్తరప్రదేశ్‌తో లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఆంధ్రజట్టు ఈ సీజన్‌లో అద్భుత విజయాలతో దూసుకెళ్తోంది. దీంతో గ్రూప్‌లోనూ రెండోస్థానంలో కొనసాగుతోంది. ఈ గ్రూప్‌లో ఆంధ్ర 22 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతుంటే.. యుపి జట్టు 14పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. యుపి జట్టు ఈ టోర్నమెంట్‌లో ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి మిగిలిన మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఉత్తప్రదేశ్‌ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ జట్టులో జాతీయ జట్టుకు ఆడిన భువనేశ్వర్‌ కుమార్‌, రింకు సింగ్‌, నితీశ్‌ రాణా, కరణ్‌ శర్మ, కార్తీక్‌ త్యాగి వంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో ఎందుకు ఆంధ్రతో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారో చెప్పలేం. ఇక ప్లేట్‌ గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్‌ జట్టు నాగాలాండ్‌తో మ్యాచ్‌ ఆడనుంది.

జట్లు(అంచనా).. ఆంధ్ర: అశ్విన్‌ హెబ్బర్‌, జ్ఞానేశ్వర్‌, హనుమ విహారి, రికీ బురు(కెప్టెన్‌), కరణ్‌ షిండే, మహేష్‌కుమార్‌, షేక్‌ రషీద్‌, గిరినాథ్‌ రెడ్డి, నితీశ్‌ కుమార్‌, షోయబ్‌ ఎండి ఖాన్‌, శశికాంత్‌,

యుపి: అక్షదీప్‌నాథ్‌, మాధవ్‌ కౌశిక్‌, నితీశ్‌ రాణా, ప్రియామ్‌ గార్గ్‌, రింకు సింగ్‌, సమర్ధ్‌ సింగ్‌, సమీర్‌ రిజ్వి, కరణ్‌ శర్మ, ధృవ్‌ జోరెల్‌, అకిల్‌ ఖాన్‌, రాజ్‌పుత్‌, భువనేశ్వర్‌ కుమార్‌.

➡️