షోరాన్‌కు పసిడి, తోమర్‌కు సిల్వర్‌ మెడల్‌

Jan 12,2024 22:02 #Sports

జకార్తా: ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్‌లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. శుక్రవారం జరిగిన 50మీ. రైఫిల్‌ా3 పొజిషన్‌ ఈవెంట్‌లో షోరాన్‌ 460.2 పాయింట్లుతో స్వర్ణ పతకం చేజిక్కించుకోగా.. తోమర్‌ 459.0 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకున్నాడు. మూడో స్థానంలో నిలిచిన థారులాండ్‌కు చెందిన థొంగ్ఫాఫుమ్‌ వొంగ్‌స్కూడీ కాంస్య పతకం అందుకున్నాడు. అఖిల్‌ షోరాన్‌, తోమర్‌ ద్వయం స్వప్నిల్‌ కుశాలేతో కలిసి టీమ్‌ విభాగంలో పసిడి వెలుగులు విరజిమ్మింది. ఫైనల్లో చైనా, కొరియా బృందాన్ని ఓడించి అగ్రస్థానంలో నిలిచింది. ఇక వ్యక్తిగత విభాగంలో తోమర్‌ మూడో స్థానానికి పరమితం కాగా.. షోరాన్‌ ఆరో స్థానంలో నిలిచి నిరాశ పరిచాడు. అఖిల్‌, స్వప్నిల్‌లకు ఇప్పటికే ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కాయి.

➡️