హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌కు లియాండర్‌, విజయ్ అమృతరాజ్‌ ఎంపిక

Dec 13,2023 22:05 #Sports

– తొలి ఆసియా టెన్నిస్‌ ఆటగాళ్లుగా రికార్డు

న్యూయార్క్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’కు ఆసియా ఖండం నుంచి సీనియర్‌ టెన్నిస్‌ ఆటగాళ్లు లియాండర్‌ పేస్‌, వెటరన్‌ విజరు అమృతరాజ్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ ట్విటర్‌ వేదికగా బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. పురుషుల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో 18 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన లియాండర్‌ టెన్నిస్‌లో భారత్‌నుంచి చిరస్మరణీయ విజయాలను అందుకున్నాడు. ఒలింపిక్స్‌లోనూ పురుషుల సింగిల్స్‌ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. మాజీ టెన్నిస్‌ దిగ్గ ఆటగాడు విజరు అమృతరాజ్‌ కంట్రిబ్యూషన్‌ కేటగిరీలో ఎంపికయ్యాడు. అమృతరాజ్‌ ప్రస్తుతం బ్రాడ్‌కాస్టర్‌, టెన్నిస్‌ ప్రమోటర్‌గా కొనసాగుతున్నాడు. పురుషుల టెన్నిస్‌ విభాగం నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారత, ఆసియా ఆటగాళ్లు. న్యూఫోర్ట్‌, రోడ్‌ ఐలాండ్‌లోని హాల్‌ 1955 నుంచి ఈ అవార్డులను ప్రతి ఏడాది ఆయా రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి ఎంపిక చేసి ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ అవార్డులను ప్రకటిస్తోంది.

➡️