స్కూల్‌గేమ్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో రాష్ట్రానికి రెండో స్థానం

Feb 18,2024 11:22 #Sports
Bronze medal for Chandana in weightlifting

ఆరు పతకాలు సాధించిన బాలికలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 67వ అండర్‌-17 బాలికల వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో రెండు బంగారు, మూడు రజత, ఒక కాంస్య పతకాలను సాధించిన్నట్లు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్రకార్యదర్శి జి భానుమూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాట్నాలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జరిగిన ఈ పోటీల్లో 49 కేజీల విభాగంలో రాజమండ్రిలోని రెయిన్‌బో హైస్కూల్‌కు చెందిన హేమశ్రీ, 59 కేజీల విభాగంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల శ్రీచక్ర జూనియర్‌ కళాశాల విద్యార్ధినివి సుస్మిత బంగారు పతకాలు సాధించారని వెల్లడించారు. 45కేజీల విభాగంలో ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌ విద్యార్ధిని చెందిన రెడ్డి భవాని, 55 కేజీల విభాగంలో రాజమండ్రిలోని రెయిన్‌బో హైస్కూల్‌ విద్యార్ధిని కారంగి తరణి, 76 కేజీల విభాగంలో గుంటూరు జిల్లా నందివెలుగు జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్ధిని బిట్ర రోచిష్మతి రజత పతకాలు సాధించారని వివరించారు. 81కేజీల విభాగంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూర్‌ కెజిబివి విద్యార్ధిని గుత్తుల మదు చందన కాంస్యపతకం సాధించారని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌కుమార్‌, సమగ్ర శిక్ష ఎస్పిడి బి శ్రీనివాసరావు, పాఠశాల విద్య డైరెక్టర్‌ పి పార్వతి పతకాలు సాధించిన క్రీడాకారులను, టీం కోచ్‌గా వ్యవహరించిన నందివెలుగు జెడ్‌పి హైస్కూల్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ కొల్లిపర నాగశిరీషను అభినందించారని తెలిపారు.

➡️