టి20 ప్రపంచ కప్‌కు ముందు -బంగ్లాతో ఓ వార్మప్‌ మ్యాచ్‌

May 17,2024 22:16 #Sports

దుబాయ్: అమెరికా. వెస్టిండీస్‌ వేదికలుగా జూన్‌ ఒకటి నుంచి జరగనున్న టి20 ప్రపంచ్‌ కప్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానుంది. ప్రధాన టోర్నీకి ముందు టీమిండియా ఓ వార్మప్‌ మ్యాచ్‌ను ఆడనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసిసి) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. మే 27 వ తేదీ నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు జరగనున్నాయి. వార్మప్‌ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనున్నట్లు ఆ మ్యాచ్‌ వేదిక, తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇక క్వీన్స్‌పార్క్‌ ఓవర్‌లో వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా మధ్య మే 30న జరగనున్న మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించనున్నట్లు, టెక్సాస్‌, ఫ్లోరిడా, క్వీన్స్‌పార్క్‌, ట్రినిడాడ్‌లలో మొత్తం 17 వార్మప్‌ మ్యాచ్‌లు జరగనున్నట్లు పేర్కొంది. ఇక ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ను చేజిక్కించుకొనేందుకు మొత్తం 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లు మాత్రం వార్మప్‌ మ్యాచ్‌లు ఆడడం లేదు. ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ మధ్య మే 22వ తేదీ నుంచి నాలుగు మ్యాచ్‌ల ద్వైపాక్షి సిరీస్‌ జరగనున్నది. న్యూజిలాండ్‌ తన తొలి మ్యాచ్‌ను జూన్‌ 8న ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడనుంది.

➡️