14 ఓవర్లప్పుడు వర్షం.. నిలిచిన ఆసీస్‌-దక్షిణాఫ్రికా సెమీస్‌

ain-in-14%20overs-Aussie-South-Africa-semis-stopped

సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా.. మొదటగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌ కు దిగిన సౌతాఫ్రికా జట్టుకు ఆరంభంలోనే కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్‌ బౌలింగ్‌ దాటికి టాప్‌ ఆర్డర్‌ విఫలమైంది. దీంతో 4 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. ఈ నేపథ్యంలో, నేడు మ్యాచ్‌ మొదలైన గంటకే వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. వర్షం కారణంగా ఆసీస్‌-దక్షిణాఫ్రికా సెమీస్‌ నిలిచిపోయింది. సఫారీ మిడిలార్డర్‌ బ్యాట్స్‌ మెన్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ (10 బ్యాటింగ్‌), డేవిడ్‌ మిల్లర్‌ (10 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ 2, హేజెల్‌ వుడ్‌ 2 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను దెబ్బతీశారు.

➡️