అందరిచూపు ధోనీపైనే..

Apr 5,2024 06:35 #Cricket, #csk vs srh, #ipl 2024
  • నేడు హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌-చెన్నై ఐపిఎల్‌ మ్యాచ్‌
  • రాత్రి 7.30గం||ల నుంచి

హైదరాబాద్‌: ఫేర్‌వెల్‌ ఐపిఎల్‌ సీజన్‌ ఆడుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీపైనే అందరి చూపు నెలకొంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో శుక్రవారం సన్‌రైజర్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య ఐపిఎల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సీజన్‌ తర్వాత ధోనీ ఐపిఎల్‌ కెరీర్‌కు గుడ్‌బై చెబుతాడనే దృష్ట్యా అతడి ఆటను చూసేందుకు అభిమానులు స్టేడియం భారీగా హాజరుకావడం సహజం. ఈ సీజన్‌లో ధోనీ బ్యాటింగ్‌ మెరుపులు పెద్దగా ప్రదర్శించలేకపోయాడు. తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన చెన్నై.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. మరోవైపు సన్‌రైజన్స్‌ తొలి, మూడో మ్యాచుల్లో ఓడి 2వ మ్యాచ్‌లో ఏకంగా ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబయి ఇండియన్‌పై 31పరుగుల తేడాతో నెగ్గింది. సన్‌రైజర్స్‌, చెన్నై జట్లు ఈసారి కొత్త సారథులతో బరిలోకి దిగుతున్నాయి. సన్‌రైజర్స్‌ జట్టుకు పాట్‌ కమిన్స్‌, చెన్నై జట్టుకు రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యం వహిస్తున్నారు. ఇక ధోనీ చివరి మ్యాచ్‌ ఈ మైదానంలో ఆడనున్న నేపథ్యంలో టికెట్లన్నీ హాట్‌కేకుల్లా ఇప్పటికే అమ్ముడైపోయాయి.
జట్లు(అంచనా)…
సన్‌రైజర్స్‌: పాట్‌ కమిన్స్‌(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, హెడ్‌, అభిషేక్‌ శర్మ, మార్‌క్రమ్‌, క్లాసెన్‌, అబ్దుల్‌ సమద్‌, షాబాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మయాంక్‌ మార్కండే/ఉనాద్కట్‌.
చెన్నై: గైక్వాడ్‌(కెప్టెన్‌), రచిన్‌ రవీంద్ర, జడేజా, రహానే, దూబే, మిఛెల్‌, రిజ్వి, ధోనీ, దీపక్‌ చాహర్‌, దేశ్‌పాండే, పథీరణ/శార్దూల్‌ ఠాకూర్‌.

➡️