భారత్‌లోనే ఐపిఎల్‌ మ్యాచ్‌లన్నీ..

Mar 16,2024 22:27 #BCCI, #Cricket, #IPL, #Sports
  • త్వరలో పూర్తి షెడ్యూల్‌ బిసిసిఐ కార్యదర్శి జే షా

ముంబయి: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17 మ్యాచ్‌లన్నీ స్వదేశంలోనే నిర్వహిస్తామని బిసిసిఐ కార్యదర్శి జే షా శనివారం స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల నేపథ్యంలో జే షా ఈ ప్రకటన చేశారు. రెండో అర్ధ భాగం మ్యాచ్‌లను యుఇఎలో నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో జే షా తాజాగా ఈ ప్రకటన చేశారు. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 7వరకు జరిగే ఐపిఎల్‌ తొలి సీజన్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ఇప్పటివరకు బిసిసిఐ ప్రకటించింది. అందులో మొత్తం 21 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో త్వరలో మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌తో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 4వరకు ఏడు దశల్లో సార్వత్రికలు దేశవ్యాప్తంగా జరగనున్న విషయం తెలిసిందే. యుఏఇ, ఇతర వేదికల్లో ఐపిఎల్‌ను నిర్వహించే ప్రసక్తి లేదన్నారు. ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో చెన్నైసూపర్‌ కింగ్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్‌ ఐపిఎల్‌ జరగనుందని, ఏప్రిల్‌ 7న జరిగే లక్నో సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ల వరకు బిసిసిఐ షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించింది. లీగ్‌ ప్రారంభమయ్యాక మొదటి వారంతంలో జరిగే మొదటి డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌ల్లో పంజాబ్‌ కింగ్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతానైట్‌ రైడర్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే.

➡️