- అండర్సన్ 700 వికెట్ల ఘనతపై ప్రసంసల జల్లు
ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ మీడియం పేసర్ జేమ్స్ అండర్సన్ 700 వికెట్ల మార్క్‌తో చరిత్ర సష్టించారు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా నిలిచారు. జేమ్స్ అండర్సన్ సాధించిన ఈ ఘనతపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎక్స్ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘2002లో ఆస్ట్రేలియాలో అండర్సన్ ఆటను నేను మొదటిసారి చూశా. బంతిపై అతడి నియంత్రణ ప్రత్యేకంగా కనిపించింది. ఆ సమయంలో నాసిర్ హుస్సేన్ అండర్సన్ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఒక ఫాస్ట్ బౌలర్ 22 ఏళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడుతూ 700 వికెట్ల మైలురాయిని చేరుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. అండర్సన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఇది నిజంగా అద్భుతమే’ అని సచిన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
The first time I saw Anderson play was in Australia in 2002, and his control over the ball looked special.
Nasser Hussain spoke very highly of him back then and today, I am sure, he would say, “Maine bola tha” — that he had called it so early. 😀
700 test wickets is a stellar… pic.twitter.com/GijfRXYvoY
— Sachin Tendulkar (@sachin_rt) March 9, 2024