ఆంధ్ర-యుపి మ్యాచ్‌ డ్రా

Feb 13,2024 08:10 #Ranji Trophy, #Sports

విశాఖపట్నం: ఆంధ్ర-ఉత్తరప్రదేశ్‌ జట్ల మధ్య జరిగిన రంజీట్రోఫీ గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌ డ్రా అయ్యింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 5వికెట్ల నష్టానికి 271పరుగులతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్రప్రదేశ్‌ జట్టు 9వికెట్ల నష్టానికి 429పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. ఆ తర్వాత ఇరుజట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించడంతో ఉత్తరప్రదేశ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్రజట్టు 261పరుగులు చేయగా.. యుపి జట్టు 198పరుగులకు కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రజట్టుకు తొలి 63పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించడంతో మూడు పాయింట్లు జమ అయ్యాయి. దీంతో ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు 25పాయింట్లతో 2వ స్థానంలో నిలిచి క్వార్టర్స్‌కు చేరువైంది. 16నుంచి జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు కేరళతో తలపడనుంది.

➡️