43ఏళ్ల వయసులో బొప్పన్నకు టాప్‌ర్యాంక్‌

Jan 25,2024 08:26 #bopanna, #Sports, #teniss

భారత డబుల్స్‌ స్పెషలిస్ట్‌ రోహన్‌ బొప్పన్న ఓ రికార్డును తన పేర లిఖించుకోవడంతోపాటు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌కు చేరాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో 2వ సీడ్‌గా బరిలోకి దిగిన రోహన్‌ బొప్పన్న-ఎబ్డెన్‌(ఆస్ట్రేలియా) జోడీ 6-4, 7-5(7-5)తో 5వ సీడ్‌ అర్జెంటీనా జంటను చిత్తుచేశారు. దీంతో సెమీస్‌కు చేరడంతో పాటు రోహన్‌ బొప్పన్న 43ఏళ్ల వయసులో ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో అత్యధిక వయసులో టాప్‌ర్యాంక్‌కు చేరిన ఓ టెన్నిస్‌ ఆటగానిగా భారత్‌కు చెందిన రోహన్‌ బొప్పన్న రికార్డు పుటల్లోకెక్కాడు. సెమీస్‌లో బొప్పన్న జోడీ జంగ్‌(చైనా)-మచాక్‌(చెక్‌)లతో తలపడనున్నారు.

➡️