INDW vs AUSW : 2వ టీ20లో భారత్‌పై ఆసీస్‌ గెలుపు

Jan 7,2024 22:25 #Cricket, #Sports
  • రేపు నిర్ణయాత్మక మ్యాచ్‌

ముంబయి : భారత మహిళల క్రికెట్‌ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆసీస్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్‌ విధించిన 131 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేధించింది. పెర్రీ 34 పరుగులతో టాప్‌ స్కోరర్గా నిలిచింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ను 1-1తో ఆసీస్‌ సమం చేసింది. కీలకమైన మాడో మ్యాచ్‌ ఈ నెల 9న జరగనుంది. ఈ సిరీస్లో తొలిమ్యాచ్లో భారత్‌ విజయం సాధించింది. కాగా, ఆస్ట్రేలియా జట్టు ఈ పర్యటనలో తొలిగా జరిగిన ఏకైక టెస్టులో ఘోరంగా పరాజయం చెందింది. అయితే తరువాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. కాగా, ఆదివారం మ్యాచ్లో ముందుగా టాస్‌ ఓడిన భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులే చేసింది. భారతబ్యాటర్లలో ఒక్కరూ భారీ స్కోరు చేయలేకపోయారు. దీప్తి శర్మ (30,27 బంతుల్లో) టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. స్మృతి మంధాన (23), రిచా ఘోష్‌ (23) ఫర్వాలేదనిపించారు. జెమీమా రోడ్రిగ్స్‌ (13) పరుగులు చేయగా.. ఓపెనర్‌ షఫాలీ వర్మ (1), కెప్టెన్‌ హర్మన్హీత్‌ (6) తీవ్ర నిరాశపర్చారు. ఆసీస్‌ బౌలర్లలో కిమ్‌ గార్త్‌, జార్జియా వేరోమ్‌, అనాబెల్‌ సదర్లాండ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆప్లీన్‌ గార్డ్నర్కు ఒక వికెట్‌ దక్కింది.

  • రాణించిన దీప్తి శర్మ.. ఆసీస్‌ ముందు స్వల్ప లక్ష్యం

తొలి టీ20లో ఆస్ట్రేలియాపై ఘన విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టిన భారత మహిళల జట్టు.. రెండో టీ20లో తడబడుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులే చేసింది. భారత బ్యాటర్లలో ఒక్కరూ భారీ స్కోరు చేయలేకపోయారు. దీప్తి శర్మ (30బీ 27 బంతుల్లో) టాప్‌ స్కోరర్‌. స్మృతి మంధాన (23), రిచా ఘోష్‌ (23) ఫర్వాలేదనిపించారు. జెమీమా రోడ్రిగ్స్‌ (13) పరుగులు చేయగా.. ఓపెనర్‌ షఫాలీ వర్మ (1), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (6) తీవ్ర నిరాశపర్చారు. ఆసీస్‌ బౌలర్లలో కిమ్‌ గార్త్‌, జార్జియా వేర్‌హామ్‌, అనాబెల్‌ సదర్లాండ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆష్లీన్‌ గార్డ్‌నర్‌కు ఒక వికెట్‌ దక్కింది.

➡️