సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా కమిన్స్‌

Mar 4,2024 21:34 #2024 ipl, #Cricket

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-2024కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా ప్యాట్‌ కమిన్స్‌ ఎంపికయ్యాడు. సన్‌రైజర్స్‌ కొత్త కెప్టెన్‌గా ప్యాట్‌ కమిన్స్‌ వ్యవహరించబో తున్నట్టు సోమవారం ఆ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. గత సీజన్‌లో ఎయిడెన్‌ మార్‌క్రమ్‌ జట్టును నడిపించగా.. తాజాగా కమిన్స్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కమిన్స్‌ ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ విన్నింగ్‌ జట్టుకు కెప్టెన్‌. ప్రపంచకప్‌ పూర్తయ్యాక జరిగిన వేలంలో ప్యాట్‌ కమిన్స్‌ను రూ.20.50 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్‌ దక్కించుకుంది. ఐపిఎల్‌ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక ధర. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా టి20లీగ్‌లో మార్‌క్రమ్‌ సారథ్యం వహించిన ఈస్టర్న్‌ కేప్‌ జట్టు టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఆ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్‌కాగా.. సఫారీ ఫ్రాంచైజీ జట్టు వరుసగా రెండుసారి ఈ టైటిల్స్‌ను చేజిక్కించుకుంది. ఇక ఐపిఎల్‌ గత రెండు సీజన్‌లలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు నిరాశపరుస్తూ.. చివరిస్థానంలో నిలుస్తోంది.

➡️