కోచ్‌ పదవికి దరఖాస్తులకు ఆహ్వానం: బిసిసిఐ

May 15,2024 16:02 #Sports

న్యూఢిల్లీ: భారత ప్రధాన కోచ్‌ పదవికి భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) దరఖాస్తులను ఆహ్వానించింది. వెస్టిండీస్‌, అమెరికా వేదికలుగా జరిగే టి20 ప్రపంచకప్‌తో ప్రస్తుత చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్‌ కోసం బిసిసిఐ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27 ఆఖరి తేదీగా ప్రకటించింది. ‘చీఫ్‌ కోచ్‌ ఎంపిక ప్రక్రియలో దరఖాస్తులను పూర్తిగా పరిశీలిస్తాం. ఆ తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేసి తుది జాబితాను వెల్లడిస్తాం’ అని బిసిసిఐ ఓ ప్రకటనలో పేర్కొంది. 60ఏళ్లలోపు జాతీయ జట్టు తరఫున 30టెస్టులు లేదా 50వన్డేలతోపాటు రెండేళ్ల పాటు కోచ్‌గా పనిచేసిన అనుభవం తప్పనిసరి అని పేర్కొంది.

➡️