హెచ్‌సీఏ అక్రమాలపై ఈడీ విచారణ..

హైదరాబాద్‌ : ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం నిర్మాణంలో రూ.20 కోట్ల మేర జరిగిన అవకతవకలపై హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌పై ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరెట్‌) విచారణ చేపట్టింది.ఈ క్రమంలో శనివారం హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు, కార్యదర్శులను ఈడీ విచారించింది. మాజీ క్రికెటర్లు ఆర్షద్‌ అయూబ్‌, శివలాల్‌ యాదవ్‌లను కూడా ఈడీ ప్రశ్నించింది. హెచ్‌సీఎ మాజీ అధ్యక్షుడు, చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో హాజరుకావాలని నోటీస్‌లో పేర్కొంది.

➡️