India మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ జాన్సన్‌ కన్నుమూత

Jun 20,2024 21:43 #Cricketer, #death, #Sports

బెంగళూరు: భారత మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ జాన్సన్‌(52) కన్నుమూశారు. బెంగళూరులోని సొంత అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్థు బాల్కనీ ప్రమాదవశాత్తూ కిందపడి మరణించారు. తీవ్రగాయాలపాలైన ఆయన్ను కుటుంబసభ్యులు వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లేలోపే ఆయన కన్నుమూశారని డాక్టర్లు తెలిపారు. డేవిడ్‌ మరణవార్తను కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ (కెసిఎ) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. డేవిడ్‌ మృతికి అనిల్‌ కుంబ్లే సంతాపం తెలిపారు. ‘నాతో క్రికెట్‌ ఆడిన స్నేహితుడు మరణించారనే వార్తను విని ఎంతో బాధపడుతున్నా. చాలా తొందరగా వెళ్లిపోయావ్‌ ‘బెన్నీ’ అని కుంబ్లే ఎక్స్‌ పోస్ట్‌లో చేశారు. ఫాస్ట్‌ బౌలర్‌ అయిన డేవిడ్‌ జాన్సన్‌ 19996లో టీమిండియా తరఫున ఆడింది రెండే టెస్టులు. ఈ రెండు మ్యాచుల్లో డేవిడ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించాక క్రికెట్‌ అకాడమీ ప్రారంభించారు. బిసిసిఐ సెక్రటరీ జే షా, ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ ఎక్స్‌లో డేవిడ్‌ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.

➡️