ఆంధ్ర ఘన విజయం

Nov 25,2023 22:15 #Sports
  • అరుణాచల్‌ప్రదేశ్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపు
  • విజయ్ హజారే వన్డే టోర్నీ

ఛండీగర్‌: విజరుహజారే వన్డే టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు రెండో లీగ్‌ మ్యాచ్‌లో గెలిచింది. గ్రూప్‌ాడిలో భాగంగా శనివారం అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్‌ప్రదేశ్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 234పరుగులు చేసింది. సచిన్‌ ధనేశ్‌ శర్మ(100నాటౌట్‌) సెంచరీతో కదం తొక్కాడు. ఆంధ్ర బౌలర్లు నితీశ్‌, తపస్వి, మనీష్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఆ లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 34.1 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది. శ్రీకర్‌ భరత్‌(117నాటౌట్‌), అశ్విన్‌ హెబ్బర్‌(103నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్‌ హనుమ విహారి(5) నిరాశపరిచాడు. మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు 17పరుగుల తేడాతో జార్ఖండ్‌పై సంచలన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టు 8వికెట్ల నష్టానికి 297పరుగులు చేయగా.. ఛేదనలో జార్ఖండ్‌ జట్టు 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 280పరుగులు చేసి ఓటమిపాలైంది. దీంతో గ్రూప్‌-బిలో హైదరాబాద్‌ జట్టు వరుసగా రెండో విజయంతో 2వ స్థానానికి ఎగబాకింది.

➡️