క్లీన్‌స్వీప్‌ దిశగా హర్మన్‌ప్రీత్‌ సేన

May 6,2024 21:58 #Bangladesh, #india womens, #t 20, #win
  • నాల్గో టి20లో బంగ్లాపై 56పరుగుల తేడాతో విజయం

ఢాకా: బంగ్లాదేశ్‌ మహిళలతో జరిగిన నాల్గో టి20లోనూ టీమిండియా మహిళల జట్టు ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 56పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ మహిళల జట్టుపై గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భార త మహిళల జట్టు 14ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 122పరుగులు చేసింది. స్మృతి మంధాన(22), హేమలత(22), హర్మన్‌ప్రీత్‌(39), రీచా ఘోష్‌(24) బ్యాటింగ్‌లో రాణించారు. బంగ్లా బౌలర్లు మరూఫా అక్తర్‌, ఖాన్‌లకు రెండేసి, షోరిఫాకు ఒక వికెట్‌ దక్కాయి.
అనంతరం భారత మహిళా బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో బంగ్లాదేశ్‌ జట్టు నిర్ణీత 14ఓవర్లు పూర్తయ్యేసరికి 7వికెట్లు కోల్పోయి 68పరుగులే చేసింది. బంగ్లా ఓపెర్‌ అక్తర్‌(21), హైదర్‌(13), ఖాతూన్‌(11) రెండంకెల స్కోర్‌ చేశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు లభించింది. ఈ గెలుపులో భారత మహిళల జట్టు ఐదు టి20ల సిరీస్‌లో 4-0 ఆధిక్యతలో ఉండగా.. ఐదో, చివరి టి20 గురువారం జరగనుంది.

స్కోర్‌బోర్డు..
భారత మహిళల ఇన్నింగ్స్‌: షెఫాలీ వర్మ (సి)రీతు మోని (బి)సోఫియా ఖాతున్‌ 2, మంధాన (బి)రెబెయా ఖాన్‌ 22, హేమలత (ఎల్‌బి)మరుఫా అక్తర్‌ 22, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (రనౌట్‌)అక్తర్‌/నిగర్‌ 39, రీచా ఘోష్‌ (సి)అక్తర్‌ (బి)రెబెయా ఖాన్‌ 24, సజన (నాటౌట్‌) 8, పూజ వస్త్రాకర్‌ (సి)రెబయా ఖాన్‌ (బి)మరుఫా అక్తర్‌ 1, అదనం 4, (14ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 122పరుగులు. వికెట్ల పతనం: 1/4, 2/35, 3/60, 4/104, 5/116, 6/122 బౌలింగ్‌: మరుఫా అక్తర్‌ 3-0-32-2, షోరిఫా ఖాతున్‌ 3-0-29-1, హబిబా ఇస్లామ్‌ 2-0-20-0, నహిదా అక్తర్‌ 3-0-21-0, రబెయా      ఖాన్‌ 3-0-29-2.

బంగ్లాదేశ్‌ మహిళల ఇన్నింగ్స్‌: డిలారా అక్తర్‌ (ఎల్‌బి)దీప్తి శర్మ 21, ముర్షిదా ఖాతున్‌ (సి)రీచా (బి)దీప్తి 1, రుబ్యా హైదర్‌ (రనౌట్‌)మంధాన/రీచా 13, నిగర్‌ సుల్తానా (ఎల్‌బి)శోభన 1, షోమా అక్తర్‌ (సి)రీచా (బి)శోభన 5, రితు మోని (సి)షెఫాలీ వర్మ (బి)రాధా యాదవ్‌ 1, షోరిఫా ఖాతున్‌ (నాటౌట్‌) 11, రెబయా ఖాన్‌ (సి)షెఫాలీ వర్మ (బి)పూజ వస్త్రాకర్‌ 8, నహిదా అక్తర్‌ (నాటౌట్‌) 2, అదనం 5. (14 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 68పరుగులు.
వికెట్ల పతనం: 1/18, 2/38, 3/39, 4/39, 5/47, 6/47, 7/66
బౌలింగ్‌: టి. సద్ధు 2-0-10-0, పూజ వస్త్రాకర్‌ 3-0-15-1, దీప్తి శర్మ 3-0-13-2, రాధా యాదవ్‌ 3-1-12-1, శోభనా 3-0-18-2.

➡️