హసరంగపై మూడు మ్యాచ్‌ల సస్పెన్షన్‌ వేటు

Feb 25,2024 16:53 #Cricket, #hasaranga, #Sports, #srilanka

శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌ వనిందు హసరంగపై మూడు మ్యాచ్‌ల సస్పెన్షన్‌ వేటు పడింది. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడో టీ20లో ఫీల్డ్‌ అంపైర్‌ లిండన్‌ హన్నిబాల్‌ను దూషించినందుకు గాను హసరంగపై చర్యలకు ఆదేశించినట్లు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. మూడు మ్యాచ్‌ల సస్పెన్షన్‌తో పాటు మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. ఈ ఘటనతో ఐదు డీ మెరిట్‌ పాయింట్లను పొందిన హసరంగ.. ఓ టెస్ట్‌, రెండు టీ20ల్లో (మొదట ఏది వస్తే అది) సస్పెన్షన్‌ను ఎదుర్కొంటాడు. దీంతో మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి రెండు టీ20లకు హసరంగ దూరం కానున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్‌పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. అదే మ్యాచ్‌లో అంపైర్‌ సూచనలు దిక్కరించినందుకు గుర్బాజ్‌ మ్యాచ్‌ ఫీజ్‌లో 15 శాతం జరిమానా విధించింది.

➡️