సూర్యకుమార్‌ యాదవ్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు

Jan 24,2024 15:56 #Cricket, #Sports, #surya kumar yadav

సూర్యకుమార్‌ యాదవ్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. 2023 ఏడాదికిగాను ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్ ద ఇయర్‌గా సూర్య ఎంపికయ్యాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును సూర్య అందుకోవడం వరుసగా రెండో సారి కావడం విశేషం. తద్వారా టీ20 ఫార్మాట్‌లో ఈ అవార్డును రెండు సార్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా సూర్య నిలిచాడు. ఈ అవార్డు కోసం సూర్యతో పాటు సికందర్‌ రజా (జింబాబ్వే), అల్పేష్‌ రమ్‌జాని (ఉగాండా), మార్క్‌ చాప్‌మన్‌ (న్యూజిలాండ్‌) అవార్డు కోసం పోటీపడ్డారు. కానీ వీళ్లందరిలో సూర్య వైపే ఐసీసీ మొగ్గు చూపింది.

➡️