ఐదో మ్యాచ్‌లోనూ భారత్‌ ఓటమే..

Apr 13,2024 22:05 #Sports

ఆసీస్‌ హాకీ జట్టు చేతిలో వైట్‌వాష్‌
పెర్త్‌: ఐదు టెస్ట్‌మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత హాకీజట్టు వైట్‌వాష్‌కు గురైంది. తొలి నాలుగు మ్యాచుల్లో ఓడి ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన భారత్‌.. శనివారం జరిగిన ఐదో, చివరి మ్యాచ్‌లో ఆసీస్‌ చేతిలో 3-2గోల్స్‌ తేడాతో ఓడింది. తొలి అర్ధభాగం సమయం ముగిసేసరికి ఇరుట్లు 1-1తో సమంగా నిలిచాయి. భారత్‌ తరఫున ఏకైక గోల్‌ను కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 20వ ని.లో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. రెండో అర్ధభాగంలో ఆస్ట్రేలియా తరఫున కీావిల్లంట్‌ 38వ, 39వ ని.లో చేశాడు. దీంతో ఆసీస్‌ 3-1గోల్స్‌ ఆధిక్యతలో నిలిచింది. ఆ తర్వాత 53వ ని.లో 21ఏళ్ల ఫార్వర్డ్‌ ఆటగాడు బాబీసింగ్‌ ధమి 53వ ని.లో భారత్‌కు మరో గోల్‌ అందించడంతో భారత్‌ 2-3తో గోల్స్‌ అంతరాన్ని మాత్రమే తగ్గించగల్గింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన భారతజట్టు బెల్జియం, న్యూజిలాండ్‌, అర్జెంటీనా, ఐర్లాండ్‌లో సంయుక్తంగా పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాదించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ తన ఆస్ట్రేలియాతో కలిసి ఒకే గ్రూప్‌ గ్రూప్‌లో ఉన్నాయి. ఒలింపిక్స్‌ గ్రూప్‌ లీగ్‌లో భాగంగా భారత పురుషుల హాకీ జట్టు 27న న్యూజిలాండ్‌, 28న అర్జెంటీనాలతో తలపడనుంది. ఈ ఒటమితో ఐదు టెస్ట్‌మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0తో చేజిక్కించుకొని క్లీన్‌స్వీప్‌ చేసింది.

➡️