నేడు ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో భారత్‌ రెండో టి20

Dec 9,2023 11:12 #Cricket, #Sports
  • రాత్రి 7 గంటల నుంచి స్పోర్ట్స్‌-18లో ప్రత్యక్ష ప్రసారం

ముంబై: మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో తొలి పోరులో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి పాలైన భారత మహిళల క్రికెట్‌ జట్టు.. శనివారం రెండో మ్యాచ్‌ కచ్చితంగా గెలవాల్సిందే.. లేదంటే ఇంకో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ను ఇంగ్లండ్‌ సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ బృందం కీలకమైన మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. గత మ్యాచ్‌లో ఓపెనర్‌ షఫాలీ వర్మ తప్ప ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. హిట్టర్లు స్మృతి మంధాన, వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ ఈ మ్యాచ్‌లో బ్యాటుకు పని చెప్పాల్సిందే. మరోవైపు తొలిమ్యాచ్‌లో శుభారంభం చేసిన ఇంగ్లండ్‌ బ్యాటర్లు, బౌలర్లు ఫామ్‌లో ఉండటంతో ఇంగ్లండ్‌ ఆత్మ విశ్వాసంతో ఉంది. ఇక వేదిక (వాంఖెడె) ఒక్కటే కావడంతో పిచ్‌ గత మ్యాచ్‌కు భిన్నంగా ఉండదు. బ్యాటింగ్‌కు కలిసొచ్చే వికెట్‌ కావడంతో బౌలర్లకు కఠిన పరీక్ష తప్పదు.

తుది జట్లు అంచనా

భారత జట్టు : స్మతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(సి) , దీప్తి శర్మ, రిచా ఘోష్‌, శ్రేయాంక పాటిల్‌, కనికా అహుజా, పూజా వస్త్రాకర్‌, రేణుకా ఠాకూర్‌ సింగ్‌, సైకా ఇషాక్‌

ఇంగ్లాండ్‌ జట్టు :డేనియల్‌ వ్యాట్‌, సోఫియా డంక్లీ, ఆలిస్‌ క్యాప్సే, నాట్‌ స్కివర్‌-బ్రంట్‌, హీథర్‌ నైట్‌ (సి), అమీ జోన్స్‌, ఫ్రెయా కెంప్‌, సోఫీ ఎక్లెస్టోన్‌, సారా గ్లెన్‌, లారెన్‌ బెల్‌, మహికా గౌర్‌

➡️