SRH: స్పిన్నర్‌ హసరంగకు గాయం.. ఐపీఎల్‌కు దూరం

Apr 9,2024 18:31 #2024 ipl, #hasaranga, #injured, #SRH

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కీలక అప్‌ డేట్‌ వెలువరించింది. స్టార్‌ స్పిన్నర్‌ వనిందు హసరంగ గాయం కారణంగా టోర్నీకి మొత్తం దూరమయ్యాడని వెల్లడించింది. హసరంగ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని సన్‌ రైజర్స్‌ టీమ్‌ మేనేజ్‌ మెంట్‌ పేర్కొంది. హసరంగ స్థానంలో శ్రీలంకకే చెందిన యువ స్పిన్నర్‌ విజయకాంత్‌ వియస్కాంత్‌ ను జట్టులోకి తీసుకున్నట్టు సన్‌ రైజర్స్‌ యాజమాన్యం నేడు ఓ ప్రకటనలో తెలిపింది. కాగా హసరంగను గతేడాది జరిగిన వేలంలో సన్‌ రైజర్స్‌ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది.

➡️