టెస్ట్‌లకు మసూద్‌, టి20లకు షాహిన్‌

Nov 16,2023 21:09 #Cricket, #Pakistan, #Sports, #T20
Masood-for-Tests-Shaheen-for-T20s

పాకిస్తాన్‌ జట్టు కెప్టెన్లను ప్రకటించిన బోర్డు
లాహోర్‌: వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ జట్టు లీగ్‌ దశలోనే నిష్క్రమించడంతో కెప్టెన్సీకి బాబర్‌ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్‌ క్రికెట్‌బోర్డు(పిసిబి) గురువారం ఓ ప్రకటనలో టెస్టు, టి20 జట్లకు కెప్టెన్లను వెల్లడించింది. టెస్ట్‌ జట్టుకు షాన్‌ మసూద్‌, టి20 జట్టుకు షాహిన్‌ అఫ్రిదిలను కెప్టెన్లుగా ప్రకటించింది. 2023-25 ఐసిసి ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ముగిసేవరకు మసూద్‌ కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు పిసిబి పేర్కొంది. టెస్ట్‌ కెప్టెన్‌గా ఎంపికైన షాన్‌ మసూద్‌ మాట్లాడుతూ.. ఈ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని, క్రికెట్‌బోర్డుకు, వాటాదారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించింది. డిసెంబర్‌ 14నుంచి ఆస్ట్రేలియాతో మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇక జనవరి 12నుంచి న్యూజిలాండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ షాహిన్‌ అఫ్రిది సారథ్యంలో పాకిస్తాన్‌ జట్టు తలపడనుంది.

➡️