మిల్లర్‌ 100.. ఆసీస్‌ టార్గెట్‌ 213

Miller-100-Aussies-target-is-213

కోల్‌కతా : కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో సెమీస్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ (101), క్లాసెన్‌ (47) రాణించడంతో సౌతాఫ్రికా 212 పరుగులకి అలౌటైంది. డేవిడ్‌ మిల్లర్‌ శతకంతో ఈ మాత్రమైన స్కోరు చేయగలిగింది. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తన అద్భుత ఇన్నింగ్స్‌ మిల్లర్‌ అదుకున్నాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. డికాక్‌ 3, బవుమా 0, డస్సెన్‌ 6, జన్‌ సేన్‌ 0, కేశవ్‌ 4, విఫలమయ్యారు. ఆసీస్‌ బౌలర్‌లో స్టార్క్‌, కమిన్స్‌ చెరో 3 వికెట్లు తీయగా.. హెజిల్‌ వుడ్‌, హెడ్‌ 2 వికెట్లు పడగొట్టారు.

➡️