దీప్తి శర్మకు ఐదు వికెట్లు.. ఆసీస్‌ 258/8

Dec 30,2023 14:42 #Cricket, #Sports

ఆస్ట్రేలియాతో (మహిళల జట్టు) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ఐదు వికెట్లతో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేయగా.. ఆసీస్‌ మహిళా జట్టు 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి.. భారత్‌ టార్గేట్‌ 259 పరుగులుగా నిర్దెశించింది. ఆసీస్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (63), ఎల్లీస్‌ పెర్రీ 50 పరుగులు రాణించగా.. తహ్లియా మెక్‌గ్రాత్‌ 24, అన్నాబెల్‌ సదర్లాండ్‌ 23 , జార్జియా వేర్‌హామ్‌ 22 , అలనా కింగ్‌ 28 పరుగులు చేసి పర్వాలేదనిపిచారు. ఎల్లీస్‌ పెర్రీ 13, బెత్‌ మూనీ 10, ఆష్లీ గార్డనర్‌ 2 పూర్తిగా నిరశపరచగా.. కిమ్‌ గార్త్‌ 11 పరుగులతో నాటౌట్‌గా నిచిలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసిన దీప్తి కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టింది.స్నేహ రానా, శ్రేయంక పాటిల్‌ పూజా వస్త్రాకర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

  • 35 ఓవర్లు పూర్తి.. 4 వికెట్ల నష్టానికి ఆసీస్‌ 166

35 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ మహిళా జట్టు 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తహ్లియా మెక్‌గ్రాత్‌ 20 , ఆష్లీ గార్డనర్‌ బ్యాటింగ్‌ చేస్తున్నారు. అంతకు ముందు ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ 98 బంతుల్లో 63 పరుగులు చేసి శ్రేయంక పాటిల్‌ బౌలింగ్‌లో రిచా ఘోష్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటవ్వగా.. ఎల్లీస్‌ పెర్రీ 47 బంతుల్లో 50 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్‌లో శ్రేయంక పాటిల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. అలాగే బెత్‌ మూనీ దీప్తీ శర్మ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది.

  • ముగిసిన 15 ఓవర్లు.. ఆసీస్‌ 76/1

15 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ వికెట్‌ నష్టానికి 76 పరుగులు చేసింది. ఎల్లీస్‌ పెర్రీ 23 బంతుల్లో 28 పరుగులు చేయగా, ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ 43 బంతుల్లో 27 పరుగులు చేసింది. అంతకు ముందు 24 బంతుల్లో 13 పరుగులు చేసిన అలిస్సా హీలీని పూజా వస్త్రాకర్‌ పెవిలియన్‌కు చేర్చింది.

  • రెండో వన్డేలో టాస్‌ ఆసీస్‌.. తొలుత బ్యాటింగ్‌

ముంబై వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ లో గెలిచి వన్డే సిరీస్‌ ను కైవసం చేసుకోవాలనుకుంటుండగా భారత్‌ గెలిచి సిరీస్‌ రేసులో నిలవాలని చూస్తోంది. భారత మహిళల జట్టు : స్మృతి మంధాన, యాస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(సి), దీప్తి శర్మ, రిచా ఘోష్‌, స్నేహ రాణా, అమంజోత్‌ కౌర్‌, పూజా వస్త్రాకర్‌, శ్రేయంక పాటిల్‌, రేణుకా ఠాకూర్‌ సింగ్‌.ఆస్ట్రేలియా మహిళల జట్టు : అలిస్సా హీలీ, ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌, ఎల్లీస్‌ పెర్రీ, బెత్‌ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్‌, ఆష్లీ గార్డనర్‌, అన్నాబెల్‌ సదర్లాండ్‌, జార్జియా వేర్‌హామ్‌, అలనా కింగ్‌, కిమ్‌ గార్త్‌, డార్సీ బ్రౌన్‌

➡️