Olympic: అంకితకు ఒలింపిక్‌ బెర్త్‌

Jun 17,2024 21:33 #Archery Competitions, #Olympic, #Sports
  • వ్యక్తిగత రికర్వు విభాగంలో కోటా
  • దీపిక కుమారికి నిరాశ

న్యూఢిల్లీ: భారత మహిళా ఆర్చర్‌ అంకిత భకత్‌ పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం రాత్రి జరిగిన 2024 ఒలింపిక్స్‌ ఆర్చరీ క్వాలిఫయర్స్‌ ఫైనల్లో అంకిత వ్యక్తిగత రికర్వు విభాగంలో ఒలింపిక్‌ బెర్త్‌ దక్కించుకుంది. ఒలింపిక్‌ బెర్త్‌ దక్కించుకొనే క్రమంలో అంకిత జాతీయ రికార్డును తిరగరాసింది. 9వ సీడ్‌గా బరిలోకి దిగిన అంకితకు తొలిరౌండ్‌లో బై లభించింది. రెండో రౌండ్‌లో 6-4తో, మూడో రౌండ్‌లో 7-3తో విజయాలు సాధించిన అంకిత.. నిర్ణయాత్మక ఒలింపిక్‌ బెర్త్‌ పోటీలో 6-0తో ఫిలిప్పీన్స్‌కు చెందిన గాబ్రియేల్‌ మోనికాను చిత్తుచేసి పారిస్‌ బెర్త్‌ను సాధించింది. ఇక 2వ సీడ్‌ దీపిక కుమారికి తొలి, రెండోరౌండ్‌లలో బై లభించగా.. మూడోరౌండ్‌లో 4-6తో అజర్‌బైజాన్‌కు చెందిన యైరగుల్‌ చేతిలో ఓటమిపాలై ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.

➡️