పాకిస్తాన్‌కు ఆధిక్యత-ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్‌

Jan 5,2024 22:20 #Sports

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో, చివరి టెస్ట్‌లో పాకిస్తాన్‌ జట్టుకు స్వల్ప ఆధిక్యత లభించింది. రెండోరోజు ఆట వెలుతురు లేమి కారణంగా సరిగా సాగకపోయినా.. శుక్రవారం మూడోరోజు ఆట పూర్తిగా కొనసాగింది. 2వికెట్ల నష్టానికి 116పరుగులతో మూడోరోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టును 299పరుగులకు ఆలౌట్‌ చేసింది. మిఛెల్‌ మార్ష్‌(54), లబూషేన్‌(60) అర్ధసెంచరీలతో రాణించగా.. అమీర్‌ జమాల్‌కు ఆరు, అఘా సల్మాన్‌కు రెండు, సాహిద్‌ ఖాన్‌, హంజాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. దీంతో పాకిస్తాన్‌కు 14పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాకిస్తాన్‌ ఆట నిలిచే సమయానికి 7వికెట్ల నష్టానికి 68పరుగులు చేసింది. హేజిల్‌ వుడ్‌ చివరి ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్‌ పతనాన్ని శాసించాడు. క్రీజ్‌లో రిజ్వాన్‌(6), జమాల్‌(0) ఉన్నారు. హేజిల్‌వుడ్‌కు నాలుగు, స్టార్క్‌కు ఒక వికెట్‌ దక్కాయి.

➡️