న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌.. పాకిస్తాన్‌ జట్టు ప్రకటన

Apr 9,2024 20:15 #Cricket, #Pakistan, #Sports

ఏప్రిల్‌ 18 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్‌తో పాకిస్తాన్‌ టీ20 సిరీస్‌ ఆడనుంది. స్వదేశంలో జరుగుతున్న ఈ టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన జట్టును పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌తో బాబర్‌ ఆజం మళ్లీ పాకిస్తాన్‌ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన యువ ఓపెనర్‌ సైమ్‌ అయూబ్‌ను సైతం సెలక్టర్లు ఎంపిక చేశారు. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ అమీర్‌, ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీం, యువ ఆటగాడు ఉస్మాన్‌ ఖాన్‌, అన్‌క్యాప్డ్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ ముహమ్మద్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు.

పాక్‌ జట్టు : బాబర్‌ ఆజం (కెప్టెన్‌), అబ్రార్‌ అహ్మద్‌, ఆజం ఖాన్‌ (వికెట్‌ కీపర్‌), ఫఖర్‌ జమాన్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌, ఇమాద్‌ వసీం, మహ్మద్‌ అబ్బాస్‌ అఫ్రిది, మహ్మద్‌ రిజ్వాన్‌ (వికెట్‌ కీపర్‌), మహ్మద్‌ అమీర్‌, ముహమ్మద్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌, నసీమ్‌ షా, సైమ్‌ అయూబ్‌, షాదాబ్‌ ఖాన్‌, షాహీన్‌ షా ఆఫ్రిది, ఉసామా మీర్‌, ఉస్మాన్‌ ఖాన్‌, జమాన్‌ ఖాన్‌

రిజర్వ్‌లు: హసీబుల్లా, మొహమ్మద్‌ అలీ, మొహమ్మద్‌ వాసిం జూనియర్‌, సాహిబ్జాదా ఫర్హాన్‌ మరియు సల్మాన్‌ అలీ అఘా

➡️