సన్‌రైజర్స్‌ కొత్త కెప్టెన్‌గా ప్యాట్‌ కమిన్స్‌

Mar 4,2024 11:57 #new captain, #Pat Cummins, #Sunrisers

హైదరాబాద్‌ : ఐపిఎల్‌ 2024లో తలపడేందుకు జట్లు సన్నద్ధమయ్యాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ జట్టు కెప్టెన్‌గా ప్యాట్‌ కమిన్స్‌ను ప్రకటించింది. గత సీజన్‌లో కెప్టెన్సీ వహించిన మార్‌క్రమ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఇటీవల ఐపిఎల్‌ ఆక్షన్‌లో ప్యాట్‌ కమిన్స్‌ రూ.20 కోట్లకు పైగా దక్కించుకున్నారు. ఈ సారి ఐపిఎల్‌ లో కొత్త అంచనాలతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బరిలోకి దిగుతోంది. డేవిడ్‌ వార్నర్‌ నాయకత్వంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపిఎల్‌లో అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు సారధ్య బాధ్యతలు మార్చటం ద్వారా తిరిగి పూర్వ వైభవం సాధించాలని ప్రయత్నిస్తోంది. ఐపిఎల్‌ లో ఈ నెల 22 నుంచి లీగ్‌కు తెరలేవనుంది. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపిఎల్‌ 2024 తొలి మ్యాచ్‌ని మార్చి 23న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఆడనుంది.

➡️