గెలుపు ముంగిట పంజాబ్‌ బోల్తా

Apr 19,2024 08:40 #2024 ipl, #Cricket, #Sports

ముంబయి చేతిలో తొమ్మిది పరుగుల తేడాతో అనూహ్య ఓటమి
ఛండీగడ్‌: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో మరో ఉత్కంఠ మ్యాచ్‌ జరిగింది. ముల్లన్‌పూర్‌ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు 9 పరుగుల తేడాతో అనూహ్యంగా ఓటమిపాలైంది. ముంబయి నిర్దేశించిన 193పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబయి చివరి నాలుగు ఓవర్ల 28పరుగుల చేయాల్సిన దశలో పంజాబ్‌ వరుసగా వికెట్లను చేజార్చుకొని మరో ఉత్కంఠ పోటీలో పరాజయాన్ని చవిచూసింది. ముంబయి నిర్దేశించిన 193పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్‌ 14పరుగులకే 4వికెట్లు కోల్పోయి ఓటమికోరల్లో నిలిచింది. ఆ తర్వాత జట్టుస్కోర్‌ 111పరుగులకు చేరేసరికి మరో మూడు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో అశుతోష్‌ శర్మ(61; 28బంతుల్లో 2ఫోర్లు, 7సిక్సర్లు), హర్‌ప్రీత్‌ బ్రార్‌(20) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. వీరిద్దరూ ఔటయ్యాక పంజాబ్‌ గెలుపుపై ఆశలు వదులుకుంది. చివర్లో రబడా సిక్సర్‌ కొట్టి మ్యాచ్‌ ముగించేలా కనిపించినా.. రనౌట్‌ కావడంతో ఫలితం తారుమారైంది. ముంబయి బౌలర్లు కోర్ట్జే, బుమ్రాకు మూడేసి, మధ్వాల్‌, హార్దిక్‌, శ్రేయస్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి. అంతకుముందు ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్‌, మిస్టర్‌ 360 డిగ్రీస్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఒంటరి పోరాటం చేశాడు. సూర్యకుమార్‌ అర్ధసెంచరీకి తోడు మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ కూడా చెలరేగడంతో ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 192పరుగులు చేసింది. జరుగుతున్న మ్యాచ్‌లో సూర్య కుమార్‌ యాదవ్‌(78; 53బంతుల్లో 7ఫోరుఓల, 3సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. ముంబయి ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌(8) రబడా బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారీ షాట్‌ ఆడి.. బౌండరీ వద్ద హర్‌ప్రీత్‌ బ్రార్‌ చేతికి చిక్కాడు. దాంతో, 18 పరుగుల వద్ద ముంబయి తొలి వికెట్‌ కోల్పోయింది. ఇషాన్‌ ఔటైనా గత మ్యాచ్‌లో సీఎస్కేపై సెంచరీ బాదిన రోహిత్‌ శర్మ(36) దంచాడు. చివర్లో పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ కట్టడి బౌలింగ్‌ చేయడంతో ముంబయి భారీస్కోర్‌పై ఆశలు వదులుకుంది.
సామ్‌ కర్రన్‌కు పగ్గాలు…
పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ వ్యక్తిగత కారణాలతో ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరంగా కావడంతో సామ్‌ కర్రన్‌ జట్టు పగ్గాలు అందుకున్నాడు. కోట్లు కుమ్మరించి సామ్‌ కర్రన్‌ను కొనుగోలు చేసిన పంజాబ్‌ కింగ్స్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ధావన్‌ సారథ్యంలోని పంజాబ్‌ జట్టు ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో గెలిచి.. మరో మూడో మ్యాచుల్లో ఓడింది. హర్షల్‌ పటేల్‌కు మూడు, సామ్‌ కర్రన్‌కు రెండు, రబడాకు ఒక వికెట్‌ దక్కాయి.

➡️