రాహుల్‌, పూరన్‌ ధనా ధన్‌..

May 18,2024 09:32 #Sports

లక్నో సూపర్‌జెయింట్స్‌ 214/6
ముంబయి: లక్నో సూపర్‌జెయింట్స్‌ బ్యాటర్లు కెఎల్‌ రాహుల్‌, నికోలస్‌ పూరన్‌ ఆఖరి మ్యాచ్‌లో ధనా ధన్‌ బ్యాటింగ్‌తో చెలరేగారు. వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో నికోలస్‌ పూరన్‌(75), కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(55) అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 214పరుగుల భారీస్కోర్‌ నమోదు చేసింది. నాల్గో వికెట్‌కు 109 పరుగులు జోడించి లక్నో జట్టు భారీస్కోర్‌కు దోహదపడ్డారు. చివర్లో ఆయుశ్‌ బడోని(22నాటౌట్‌), కృనాల్‌ పాండ్యా(12నాటౌట్‌) మెరుపులతో ముగించారు. టాస్‌ ఓడిన లక్నోకు శుభారంభం దక్కలేదు. ముంబయి పేసర్‌ నువాన్‌ తుషార తొలి షాకిచ్చాడు. ఓపెనర్‌గా వచ్చిన దేవ్‌దత్‌ పడిక్కల్‌(0)ను ఇన్‌స్వింగర్‌తో గోల్డెన్‌ డక్‌గా వెనక్కి పంపాడు. దాంతో లక్నో ఒక్క పరుగుకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మార్కస్‌ స్టోయినిస్‌(28) అండగా కేఎల్‌ రాహుల్‌(55) ఇన్నింగ్స్‌ నిర్మించాడు. అర్జున్‌ టెండూల్కర్‌ బౌలింగ్‌లో రివ్యూతో బతికిపోయిన స్టోయినిస్‌.. అన్షుల్‌ కంబోజ్‌ ఓవర్లో హ్యాట్రిక్‌ ఫోర్లు బాదాడు. మరో ఎండ్‌లో రాహుల్‌ సైతం వేగం పెంచాడు. రొమారియో షెపర్డ్‌ వేసిన 20వ ఓవర్లో బదొని రెండు సిక్సర్లు బాదడంతో లక్నో రెండొందలు కొట్టగలిగింది.
పూరన్‌ 29బంతుల్లోనే…
ఈ జోడీని వీడదీసిన పీయూష్‌ చావ్లా తర్వాతి ఓవర్లో దీపక్‌ హుడా(11)ను పెవిలియన్‌ పంపాడు. 69 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌(75) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కెప్టెన్‌ రాహుల్‌తో పోటాపోటీగా బౌండరీలు బాది కేవలం 29 బంతుల్లోనే 75 పరుగులు కొట్టాడు. పూరన్‌ 29బంతుల్లో 5ఫోర్లు, 8 సిక్సర్లతో విధ్వంస ఇన్నింగ్స్‌ ఆడి లక్నో భారీ స్కోర్‌కు పునాది వేశాడు.
స్కోర్‌బోర్డు..
లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: కెఎల్‌ రాహుల్‌ (సి)తుషారా (బి)చావ్లా 55, పడిక్కల్‌ (ఎల్‌బి)తుషార 0, స్టొయినీస్‌ (ఎల్‌బి)చావ్లా 28, దీపక్‌ హుడా (సి)నేహల్‌ వధేరా (బి)చావ్లా 11, నికోలస్‌ పూరన్‌ (సి)సూర్యకుమార్‌ (బి)తుషార 75, ఆర్షాద్‌ ఖాన్‌ (సి)నేహాల్‌ వధేరా (బి)తుషారా 0, బడోనీ (నాటౌట్‌) 22, కృనాల్‌ పాండ్యా (నాటౌట్‌) 12, అదనం 11. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 214పరుగులు.
వికెట్ల పతనం: 1/1, 2/49, 3/69, 4/178, 5/178, 6/178
బౌలింగ్‌: తుషారా 4-0-28-3, అర్జున్‌ టెండూల్కర్‌ 2.2-0-22-0, కంబోజ్‌ 3-0-48-0, చావ్లా 4-0-29-3, వధేరా 3-0-13-0, హార్దిక్‌ పాండ్యా 2-0-27-0, నమన్‌ ధీర్‌ 0.4-0-17-0, షెఫర్డ్‌ 2-0-30-0.

➡️