అస్సాంతో రంజీట్రోఫీ.. ఆంధ్ర ఘన విజయం

Jan 23,2024 08:09 #Ranji Trophy, #Sports

డిస్పూర్‌(అస్సాం): ఎలైట్‌ గ్రూప్‌-బిలో అస్సాంతో జరుగుతున్న రంజీట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 5వికెట్ల నష్టానికి 81పరుగులతో సోమవారం ఆటను కొనసాగించిన అస్సాం జట్టును 190పరుగులకు ఆలౌట్‌ చేసింది. కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌(75), సుమిత్‌(60) అర్ధసెంచరీలతో రాణించారు. 363పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అస్సాం 190పరుగులకు ఆలౌట్‌ కావడంతో ఆంధ్ర జట్టు 172పరుగుల తేడాతో గెలిచింది. ఆంధ్ర బౌలర్లు లలిత్‌ మోహన్‌కు నాలుగు, మనీష్‌ గోలమర్రుకు మూడు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రికీ బురుకు లభించింది. ఈ విజయంతో ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఆంధ్ర జట్టు 3మ్యాచుల్లో 9పాయింట్లతో మూడోస్థానంలో కొనసాగుతోంది. 26నుంచి జరిగే నాల్గో లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఛత్తీస్‌గడ్‌తో తలపడనుంది.

➡️