RCB vs SRH: హెడ్‌ సెంచరీ

Apr 16,2024 09:06 #2024 ipl, #Cricket, #Sports, #SRH
  • బెంగళూరుపై 25పరుగుల తేడాతో నెగ్గిన హైదరాబాద్‌

బెంగళూరు: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మరోసారి రికార్డు స్కోర్‌ను నమోదు చేసింది. చిదంబరం స్టేడియంలో సోమవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ జట్టు తొలిగా బ్యాటింగ్‌కు దిగి 287పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. దీంతో ఇటీవల ముంబయిపై నమోదు చేసిన 277పరుగులు భారీ స్కోర్‌ తుడిచిపెట్టుకుపోయింది. అలాగే ఐపిఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోర్‌ నమోదు చేసిన జట్టుగానూ సన్‌రైజర్స్‌ రికార్డుపుటల్లోకెక్కింది. ఇక టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ ట్రివిస్‌ హెడ్‌(102), క్లాసెన్‌(67) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 287పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో భాగంగా బెంగళూరు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసి ఓటమిపాలైంది. దీంతో సన్‌రైజర్స్‌ జట్టు 25పరుగుల తేడాతో నెగ్గి పాయింట్ల పట్టికలో నాల్గోస్థానానికి ఎగబాకింది.

తొలుత ఆర్సీబీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ.. హైదరాబాద్‌ బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా.. ట్రివిస్‌ హెడ్‌ ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. బెంగళూరు బౌలర్లపై ఏమాత్రం కనికరం చూపకుండా ఎడాపెడా షాట్లతో చెలరేగి ఆడాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే ఊచకోత మొదలుపెట్టిన హెడ్‌.. కేవలం 41బంతుల్లోనే 9 ఫోర్లు, 8సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. అతనితో పాటు ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్‌ శర్మ సైతం.. క్రీజులో ఉన్నంతవరకు మెరుపులు మెరిపించాడు. 22బంతుల్లోనే 2ఫోర్లు, 2సిక్సర్లతో 34పరుగులు చేశాడు. ఇక అభిషేక్‌ ఔట్‌ అయ్యాక వచ్చిన క్లాసెన్‌.. తొలినుంచే పరుగుల మోత మోగించాడు. 31బంతుల్లోనే 2ఫోర్లు, 7సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. అబ్దుల్‌ సమద్‌ కేవలం 10 బంతల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయగా.. మార్రకమ్‌ 17బంతుల్లోనే 2ఫోర్లు, 2సిక్సర్లతో 32పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లు ఫెర్గ్యుసన్‌కు రెండు, టోప్లేకు ఒక వికెట్‌ దక్కాయి.

ఛేదనలో బెంగళూరు ఓపెనర్లు కోహ్లి-డుప్లెసిస్‌ తొలి వికెట్‌కు 6.2ఓవర్లలో 80పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా డుప్లెసిస్‌(62; 28బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు) విధ్వంస ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ తర్వాత జాక్స్‌(7), పటీధర్‌(9), చౌహాన్‌(0) నిరాశపరిచినా.. దినేశ్‌ కార్తీక్‌(83; 35బంతుల్లో 5ఫోర్లు, 7సిక్సర్లు) చెలరేగాడు. రావత్‌(25నాటౌట్‌; 14బంతుల్లో 5ఫోర్లు) రాణించినా.. కొండంత లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. హైదరాబాద్‌ బౌలర్లు కమిన్స్‌కు మూడు, మార్కండేకు రెండు, నటరాజన్‌కు ఒక వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హెడ్‌కు దక్కింది.

స్కోర్‌బోర్డు…
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (సి)ఫెర్గ్యుసన్‌ (బి)టోప్లే 34, హెడ్‌ (సి)డుప్లెసిస్‌ (బి)ఫెర్గ్యుసన్‌ 102, క్లాసెన్‌ (సి)వి. వ్యాషక్‌ (బి)ఫెర్గ్యుసన్‌ 67, మార్‌క్రమ్‌ (నాటౌట్‌) 32, అబ్దుల్‌ సమద్‌ (నాటౌట్‌) 37, అదనం 15. (20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 287పరుగులు.
వికెట్ల పతనం: 1/108, 2/154, 3/231
బౌలింగ్‌: జాక్స్‌ 3-0-32-0, టోప్లే 4-0-68-1, యశ్‌ దయాల్‌ 4-0-51-0, ఫెర్గ్యుసన్‌ 4-0-52-2, వి. వ్యాషక్‌ 4-0-64-0, లోమ్రోర్‌ 1-0-18-0

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (బి)మార్కండే 42, డుప్లెసిస్‌ (సి)క్లాసెన్‌ (బి)కమిన్స్‌ 62, జాక్స్‌ (రనౌట్‌)ఉనాద్కట్‌ 7, రజత్‌ పటీధర్‌ (సి)నితీశ్‌ రెడ్డి (బి)మార్కండే 9, సౌరవ్‌ చౌహాన్‌ (ఎల్‌బి)కమిన్స్‌ 0, దినేశ్‌ కార్తీక్‌ (సి)క్లాసెన్‌ (బి)నటరాజన్‌ 83, మహిపాల్‌ లోమ్రోర్‌ (బి)కమిన్స్‌ 19, అనుజ్‌ రావత్‌ (నాటౌట్‌) 25, వి.వ్యాషక్‌ (నాటౌట్‌) 1, అదనం 14. (20ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 262పరుగులు.
వికెట్ల పతనం: 1/80, 2/100, 3/111, 4/121, 5/122, 6/181, 7/244
బౌలింగ్‌: అభిషేక్‌ శర్మ 1-0-10-0, భువనేశ్వర్‌ కుమార్‌ 4-0-60-0, షాబాజ్‌ అహ్మద్‌ 1-0-18-0, నటరాజన్‌ 4-0-47-1, కమిన్స్‌ 4-0-43-3, మార్కండే 4-0-46-2, ఉనాద్కట్‌ 2-0-37-0

➡️