శాంటోకు పగ్గాలు

  • టి20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్‌ జట్టు ప్రకటన

ఢాకా: వెస్టిండీస్‌, అమెరికా వేదికగా జూన్‌ 2నుంచి జరిగే టి20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బిసిబి) 15మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. నజ్ముల్‌ హుసేన్‌ శాంటో కెప్టెన్‌గా, సీనియర్‌ పేసర్‌ తస్కిన్‌ అహ్మద్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. 15మందితో ఆటగాళ్ల జట్టును మెగా టోర్నీకి సెలెక్టర్లు బలమైన బృందాన్ని ఎంపిక చేశారు. సీనియర్‌ ఆటగాడు మహ్మదుల్లాకు సెలెక్టర్లు తుది స్క్వాడ్‌లో చోటు కల్పించారు. ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన తౌహిద్‌ హృదరు టి20 వరల్డ్‌ కప్‌ బెర్తు దక్కించుకున్నాడు. బంగ్లా స్క్వాడ్‌లో ఉన్న సీనియర్‌ ఆల్‌రౌండర్‌ షకిబుల్‌ హసన్‌కు ఇదే చివరి టి20 వరల్డ్‌ కప్‌ కావొచ్చు. అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనాలకు చిరునామాగా మారిన బంగ్లాదేశ్‌ సీనియర్లు, జూనియర్ల కాంబినేషన్‌తో పటిష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌, ఆసియాకప్‌లలో వైఫల్యం తర్వాత ఇటీవలికాలంలో బంగ్లాదేశ్‌ టెస్టు, వన్డే, టి20ల్లో అదరగొడుతోంది. ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్‌ జూన్‌ 8న గ్రూప్‌ లీగ్‌ తొలి మ్యాచ్‌ శ్రీలంకతో తలపడనుంది.

జట్టు : నజ్ముల్‌ హుసేన్‌ శాంటో(కెప్టెన్‌), తస్కిన్‌ అహ్మద్‌(వైస్‌ కెప్టెన్‌), లిట్టన్‌ దాస్‌, సౌమ్య సర్కార్‌, తంజిద్‌ హసన్‌ తమీమ్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, తౌహిద్‌ హృదరు, మహ్మదుల్లా రియాద్‌, జకేర్‌ అలీ అనిక్‌, తన్వీర్‌ ఇస్లాం, షక్‌ మహెది హసన్‌, రిషద్‌ హొసేన్‌, ముస్తాఫిజర్‌ రెహ్మాన్‌, షోరిఫుల్‌ ఇస్లాం, తంజీం హసన్‌ షకీబ్‌.

➡️