ద్రావిడ్‌కు విశ్రాంతి… కోచ్‌గా సితాన్షు కోటక్‌కు బాధ్యతలు

Dec 16,2023 16:37 #Sports

దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా టీ20 సిరీస్‌ ముగిసిన విషయం తెలిసిందే. టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్‌ జరగనుంది. ఈ పర్యటనలో టీ20 సిరీస్‌కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించిన రాహుల్‌ ద్రావిడ్‌కు వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించింది బిసిసిఐ. ద్రావిడ్‌ స్థానంలో సౌరాష్ట్ర మాజీ ఆటగాడు సితాన్షు కోటక్‌ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ సిబ్బంది అజరు రాత్రా, రాజిబ్‌ దత్తా ఫీల్డింగ్‌, బౌలింగ్‌ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.

➡️