టీ20 ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి రుతురాజ్‌.. టాప్‌-5లోకి బిష్ణోయ్

Dec 6,2023 15:02 #Cricket, #Sports, #T20

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. ఆసీస్‌తో సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 55.75 సగటున 223 పరుగులు చేసిన రుతురాజ్‌ 56 స్థానాలు మెరుగపర్చుకుని ఏడో స్థానానికి.. అదే సిరీస్‌లో బౌలింగ్‌లో సత్తా చాటిన రవి బిష్ణోయ్ (5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు) ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి చేరాడు. ఇదే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ (5 మ్యాచ్‌ల్లో 144 పరుగులు) తన టాప్‌ ర్యాంక్‌లోనే (881పాయింట్లు)లోనే కొనసాగుతున్నాడు. సూర్య తర్వాత మహ్మద్‌ రిజ్వాన్‌, మార్క్రమ్‌, బాబార్‌ ఆజమ్‌, రిలీ రొస్సో, డేవిడ్‌ మలాన్‌, రుతురాజ్‌, జోస్‌ బట్లర్‌, రీజా హెండ్రిక్స్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ వరుసగా టాప్‌-10లో ఉన్నారు. బౌలింగ్‌లో.. రషీద్‌ ఖాన్‌ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. హసరంగ, ఆదిల్‌ రషీద్‌, తీక్షణ, బిష్ణోయ్, సామ్‌ కర్రన్‌, ఫజల్‌ హక్‌ ఫారూకీ, ముజీబ్‌, అకీల్‌ హొసేన్‌, హాజిల్‌వుడ్‌ టాప్‌-10 జాబితాలో నిలిచారు.

➡️