చీఫ్‌ సెలెక్టర్‌గా వహాబ్‌ రియాజ్‌ ఎంపిక- పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడి

Nov 17,2023 17:55 #Cricket, #Pakistan

లాహోర్‌: పాకిస్తాన్‌ పురుషుల క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌గా వహాబ్‌ రియాజ్‌ ఎంపికయ్యాడు. ఈమేరకు పాకిస్తాన్‌ క్రికెట్‌బోర్డు(పిసిబి) శుక్రవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్‌, వన్డే, టి20 జట్లను పాకిస్తాన్‌ క్రికెట్‌జట్టు ఎంపిక రియాజ్‌ నేతృత్వంలోనే జరగనుంది. ‘జాతీయ పురుషుల జట్టు సెలెక్టర్‌గా ఎంపికవ్వడం గౌరవంగా భావిస్తానని, ఆ బాధ్యతలను సమర్ధవంతం నిర్వహించగలనని పిసిబి మేనేజ్‌మెంట్‌ కమిటీ భావించడం పట్ల గర్వంగా ఉందని, ఈ మేరకు పిసిబి కమిటీ ఛైర్మన్‌ జాకా అష్రఫ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని 38ఏళ్ల వహాబ్‌ రియాజ్‌ పేర్కొన్నాడు. ఎడమచేతి వాటం పేసర్‌ అయిన రియాజ్‌ పాకిస్తాన్‌ తరఫున 27టెస్టులు, 91వన్డేలు, 36టి20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 237 వికెట్ల తీశాడు.

➡️