ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు

Apr 13,2024 22:10 #Sports

రికార్డు పుటల్లో నేపాల్‌ బ్యాటర్‌ దీపేంద్ర
మస్కట్‌(ఓమన్‌): ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి మరో ఆటగాడు రికార్డు పుటల్లోకెక్కాడు. ఒమన్‌ వేదికగా జరుగుతున్న ఎసిసి పురుషుల ప్రిమియర్‌ లీగ్‌లో నేపాల్‌ బ్యాటర్‌ దీపేంద్ర సింగ్‌ ఐరీ కతార్‌ బౌలర్‌ కమ్రన్‌ ఖాన్‌ వేసి చివరి ఐదు బంతులను సిక్సర్లు కొట్టి.. ఆ తర్వాత వేసిన మరో బౌలర్‌ తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. దీంతో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో చేరిన మూడో ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో దీపంఏద్ర కేవలం 21బంతుల్లోనే 64పరుగులతో రాణించాడు. దీంతో నేపాల్‌ జట్టు తొలిగా బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 210పరుగులు చేసింది. ఇక తక్కువ బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో యువరాజ్‌ సింగ్‌(12బంతులు) అందరికంటే ముందుండగా.. 2023 చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో మంగోలియాపై నేపాల్‌ బ్యాటర్‌ కేవలం 9బంతుల్లోనే సెంచరీ కొట్టి యువరాజ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు.
టి20ల్లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు…
1. యువరాజ్‌ సింగ్‌(భారత్‌) : 2007 ఇంగ్లండ్‌పై
2. కీరన్‌ పొలార్డ్‌(వెస్టిండీస్‌) : 2021 శ్రీలంకపై…
3. దీపేంద్ర సింగ్‌(నేపాల్‌) : 2024 కతార్‌పై…

➡️