సౌతాఫ్రికా కెప్టెన్ బవుమాకు గాయం..

Dec 27,2023 12:50 #Cricket, #Sports

సెంచూరియన్ : సెంచూరియన్‌లో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా గాయపడ్డాడు. టీమ్ ఇండియా ఇన్నింగ్స్‌లో మార్కో జాన్సెన్ వేసిన 20వ ఓవర్‌లో కోహ్లీ కొట్టిన బంతిని అడ్డుకునే క్రమంలో బవుమా కాలుకి గాయమైంది. ఎడమ మోకాలు వెనక భాగంలో పట్టేయడంతో అతను పరుగెత్తేందుకు ఇబ్బందిపడ్డాడు. ఆ ఘటన తర్వాత బవుమా మైదానం వీడాడు. వెంటనే బవుమాను స్కానింగ్ కోసం పంపించగా.. మోకాలి వెనక భాగంలో కండరాలు చీలినట్టు తేలింది. ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. బవుమా మైదానం వీడిన తర్వాత సీనియర్ ఓపెనర్ డీన్ ఎల్గర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

➡️