ఉంగుటూరులో రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం

Jan 28,2024 12:16 #handball, #Sports

ప్రజాశక్తి-ఉంగుటూరు(ఏలూరు) : ఉంగుటూరు మండలం నారాయణపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో 45వ రాష్ట్రస్థాయి అండర్- 19 బాలుర హ్యాండ్ బాల్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 15 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని ఏపీ స్టేట్ సెక్రెటరీ శ్రీనివాస్ చెప్పారు. ఏ, బి, సి ,డిలో నిలిచిన జట్లకు సెమ్మిఫైనల్, ఫైనల్ పోటీలు నిర్వహించి రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేయనున్నామని తెలిపారు. ఇక్కడ ఎంపికైన జట్టు వచ్చే నెలలో నేషనల్ స్థాయి గేమ్స్లో ఏపీ టీమ్ గా ఆడనున్నారని తెలిపారు.

➡️