T20 World Cup : డికాక్‌ ధనా ధన్‌..

Jun 19,2024 23:12 #Cricket, #Sports, #T20 World Cup 2024
  • అమెరికాపై 18పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు

ఆంటిగ్వా: టి20 ప్రపంచకప్‌ సూపర్‌-8లో దక్షిణాఫ్రికా జట్టు బోణీకొట్టింది. అమెరికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 18పరుగుల తేడాతో గెలిచింది. తొలుత ఓపెనర్‌ డికాక్‌(74) అర్ధసెంచరీకి తోడు కెప్టెన్‌ మార్‌క్రమ్‌(46), క్లాసెన్‌(36నాటౌట్‌), స్టబ్స్‌(20నాటౌట్‌) రాణించడంతో దక్షిణాఫ్రికా జట్టు 4వికెట్ల నష్టానికి 194పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అమెరికా జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 6వికెట్లు కోల్పోయి 176పరుగులే చేసింది. తొలుత దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌ డికాక్‌(74) రాణించినా.. మరో బ్యాటర్‌ రోడ్రిగ్స్‌(11) నిరాశపరిచాడు. దీంతో సఫారీ జట్టు 16పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత మార్‌క్రమ్‌తో కలిసి డికాక్‌ 2వ వికెట్‌కు 110పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ ఔటయ్యాక దక్షిణాఫ్రికాను క్లాసెన్‌, స్టబ్‌ ఆదుకున్నారు. వీరిద్దరూ చివర్లో చెలరేగి ఆడడంతో ఆ జట్టు 194పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. అమెరికా బౌలర్లు నేత్రావాల్కర్‌, హర్మీత్‌ సింగ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో అమెరికా ఓపెనర్‌ టేలర్‌(24)కి తోడు గౌస్‌(80నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించాడు. చివర్లో హర్మీత్‌ సింగ్‌(38) బ్యాట్‌ ఝుళిపించినా.. చివరి రెండు ఓవర్లను దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంలో దక్షిణాఫ్రికాకు విజయం దక్కింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ డికాక్‌కు లభించింది.

స్కోర్‌బోర్డు…
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి)షాయన్‌ (బి)హర్మీత్‌ సింగ్‌ 74, హెండ్రిక్స్‌ (సి)ఆండర్సన్‌ (బి)నేత్రావాల్కర్‌ 11, మార్‌క్రమ్‌ (సి)అలీ ఖాన్‌ (బి)నేత్రావాల్కర్‌ 46, డేవిడ్‌ మిల్లర్‌ (సి అండ్‌ బి)హర్మీత్‌ సింగ్‌ 0, క్లాసెన్‌ (నాటౌట్‌) 36, స్టబ్స్‌ (నాటౌట్‌) 20, అదనం 7. (20ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 194పరుగులు.
వికెట్ల పతనం: 1/16, 2/126, 3/126, 4/141
బౌలింగ్‌: నేత్రావాల్కర్‌ 4-0-21-2, అలీ ఖాన్‌ 4-0-45-0, జోష్‌దీప్‌ సింగ్‌ 2-0-36-0, హర్మీత్‌ సింగ్‌ 3-0-29-0, స్టీవెన్‌ టేలర్‌ 2-0-21-0, ఆండర్సన్‌ 1-0-17-0

➡️