T20 World Cup : టీమిండియాకు తొలి పరీక్ష

Jun 20,2024 05:40 #Cricket, #T20 world cup, #Team India
  • సూపర్‌-8లో నేడు ఆఫ్ఘన్‌తో ఢీ
  • రాత్రి 8.00గం||ల నుంచి

బ్రిడ్జిటౌన్‌: టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సూపర్‌-8లో తొలి పరీక్షను ఎదుర్కోనుంది. గ్రూప్‌-ఎ వరుస విజయాలతో సూపర్‌-8కు చేరిన టీమిండియా ఇక దానిపై దష్టి సారించింది. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారతజట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో సూపర్‌- 8లో తలపడనుంది. విండీస్‌ గడ్డపై ఐదు రోజుల వ్యవధిలోనే భారత్‌ మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈనెల 20న అఫ్ఘాన్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుండగా, ఆ తర్వాత 22న బంగ్లా, 24న ఆసీసతో తలపడుతుంది. మరోవైపు ఇలాంటి కఠిన సవాల్‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని కెప్టెన్‌ రోహిత్‌ చెబుతున్నాడు. ‘సూపర్‌-8లో మ్యాచ్‌ల మధ్య మాకు ఎక్కువ సమయం లేదు. ఐదు రోజుల వ్యవధిలోనే మూడు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణాలు కూడా తప్పవు. ఇది హడావిడిగా కనిపించినా.. మేం దీన్ని ఓ సాకుగా చెప్పాలనుకోవడం లేదు’ అన్నాడు. అలాగే జట్టులో ఉన్న వారందరూ ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే ఉత్సుకతతో ఉన్నారని, మేం మా స్కిల్‌ సెషన్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటాం. ప్రతి స్కిల్‌ సెషన్‌లో సాధించడానికి ఏదో ఒకటి ఉంటుంది. ప్రస్తుతం మా ఫోకస్‌ అంతా జట్టుగా ఏం చేయాలనే దానిపైనే ఉంది. ఇక్కడ చాలా మ్యాచ్‌లు ఆడాం. ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏంటో తెలుసు. అందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.
జట్లు(అంచనా)…
భారత్‌: రోహిత్‌(కెప్టెన్‌), కోహ్లి, సూర్యకుమార్‌, దూబే, పంత్‌(వికెట్‌ కీపర్‌), అక్షర్‌, జడేజా, హార్దిక్‌ పాండ్యా, బుమ్రా, ఆర్ష్‌దీప్‌, సిరాజ్‌.
ఆఫ్ఘనిస్తాన్‌: రషీద్‌ ఖాన్‌(కెప్టెన్‌), గుర్బాజ్‌(వికెట్‌ కీపర్‌), జడ్రాన్‌, నజీబుల్లా, నబి, గులాబుద్దిన్‌, అజ్మతుల్లా, జన్నత్‌, ముజీబ్‌, నవీన్‌-ఉల్‌-హక్‌, ఫారుఖీ.

➡️