పాకిస్తాన్‌తో మూడో టెస్టు.. ఆసీస్‌ జట్టు ప్రకటన

Dec 31,2023 13:33 #Australia, #Cricket, #Pakistan, #test match

సిడ్నీ : జనవరి 3 నుంచి సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా పాకిస్తాన్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. మూడో టెస్టుకు రెండో టెస్టుకు ఎంపిక చేసిన జట్టునే సెలక్టర్లు కొనసాగించారు. తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడనున్న స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన హౌం గ్రౌండ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి తన టెస్టు కెరీర్‌కు ముగింపు పలకాలని భావిస్తున్నాడు. కాగా రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో సిరీస్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే..

ఆసీస్‌ జట్టు: పాట్‌ కమిన్స్‌(కెప్టెన్‌), స్కాట్‌ బోలాండ్‌, అలెక్స్‌ కారీ, కామెరాన్‌ గ్రీన్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌,ట్రావిస్‌ హెడ్‌, ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లాబుషేన్‌,నాథన్‌ లియోన్‌,మిచెల్‌ మార్ష్‌,స్టీవ్‌ స్మిత్‌,మిచెల్‌ స్టార్క్‌,డేవిడ్‌ వార్నర్‌

➡️